జాతీయం

ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న భారత్ UPI

ఒకప్పుడు భారత్‌లో మొదలైన డిజిటల్ ప్రయోగం.. నేడు ప్రపంచానికి ఒక నమూనాగా మారుతోందా?

భారతదేశంలో సాధారణ కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు విస్తృతంగా ఉపయోగిస్తున్న UPI ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ విస్తరిస్తోంది. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చెల్లింపు వ్యవస్థలో లావాదేవీల సంఖ్య వేల రెట్లు పెరిగింది. 2016-17లో 1.78 కోట్ల లావాదేవీలు జరగగా, 2025-26లో ఈ సంఖ్య 24,162 కోట్లకు చేరింది. UPIలో జరుగుతున్న లావాదేవీల్లో 86 శాతం రూ.500లోపు ఉన్నవేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో చిన్న మొత్తాల చెల్లింపులకు కూడా డిజిటల్ విధానం విస్తృతంగా ఉపయోగిస్తున్న విషయం స్పష్టమవుతోంది. UAE, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మౌరిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు సహా 11 దేశాలు UPIని స్వీకరించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా భారత్ UPI నమూనాను డిజిటల్ పేమెంట్స్ రంగంలో ప్రస్తావించింది. భారత్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *